36.యేసు నీ త్యాగమే నా పాప శిక్షకై

పల్లవి: 
యేసు నీ త్యాగమే
నా పాప శిక్షకై  ||2||

ఎన్నో నిందలు అవి నా కోసమా మలినమైన నా గతం ఇక లేదయా ||2||

నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్యా ||2||

1. బంధువులే భాధించెడబాసినా
నా వారే నన్నే అమ్మేసిన ||2||

స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన నన్ను ఒంటరిని చేసి రాళ్లు రువ్విన ||2||
                           ||నా జీవితమే||

2. బ్రతుకంతా చీకటి కమ్మేసిన రక్కసి వేదనలే శోధించిన ||2||

రోధనలే రోగమై వేధించిన
మరణాలు విలయాలు కబలించిన ||2||
                      ||నా జీవితమే||

3. బలహీనతలో నను బలపరిచిన పాపినైన నాకై మరణించిన ||2||

మృతమైన నన్ను మహిమగా మార్చిన మారని నీ ప్రేమకై బానిసైనా ||2||

నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్యా ||2||

     

Footer Page