పల్లవి :
నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని
నా ..కోసమే ఒక చిత్తమే ఉన్నాధని ||2||
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై ||2||
ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే
||నా జీవితానికీ||
చరణం:
సృష్టిలోనే సౌందర్యమైన అదియే వివాహ బంధము ...
కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము ||2||
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
జీవము అను కృపావరములో ఒకరికొకరుగా జీవించాలి||2|||
||నా జీవితానికీ||
చరణం:
పానుపే పవిత్రమైన నిష్కళంకమైనది ...
జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు. ||2||
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
అది కళంకము ముడతలైనను మరి ఏదియు లేని ప్రేమ ఇది ||2||
||నా జీవితానికీ||
చరణం:
క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్య ను ప్రేమించవలెను ...
సంఘమూ లోబడినంతగా భార్య భర్త కు లోబడవలెను. ||2||
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై ||2||
ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే ||2||
||నా జీవితానికీ||
2 thoughts on “37.నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని”
Comments are closed.