యెహోవా నా దేవా నీ దయలో కాయుమా ||2||
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే - ఏలికగా నను మలచితివే||2||
||యెహోవా||
చరణం: 1
నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా ||2||
ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! ||2||
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా!
||యెహోవా||
చరణం :2
నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు ||2||
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలిచెదరు ||2||
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా!
||యెహోవా||
చరణం:3
యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే ||2||
ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! ||2||
నన్ను నియమించితివే - నాలో ఫలించితివే!
యెహోవా నా దేవా నీ దయలో కాచితివే ||2||
పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే ||2||
||యెహోవా||