పల్లవి:
నీ కృపలోనే బ్రతకాలని ఆశ
నీ కౌగిలిలో ఉండాలని కోరిక ||2||
నీ శరణు నే జొచ్చియున్నానయ్యా
నా దిక్కు నీవే నయ్యా ||2|||ఆధారమా|
ఆధారమా ఆనందమా ఆశ్రయపురమెసయ్య ||2||
||నీ కృపలోనే||
నీ నీటి కాలువ యోరను ఉండి ఫలమిచ్చు చెట్టులా బ్రతకాలని
దివారాత్రము నిన్నే ధ్యానించుచు ధన్యుడనై జీవించాలని.||2||
నీ సారమే నాలోపట - అభివృద్ధి చెందాలని ||2||
||నీ శరణు నే జొచ్చియున్నానయ్యా||
నీదుఒడిలో నే ఒదిగిపోయి నిశ్చింతగానే ఉండాలని
నీలో ఉన్న అతిశ్రేష్ట ఫలములు అనుభవిస్తూ బ్రతకాలని ||2||
పరిశుద్ధతే జీవితమై ప్రజ్వలించాలని ||2||
||నీ శరణు నే జొచ్చియున్నానయ్యా||
1 thought on “25.నీ కృపలోనే బ్రతకాలని ఆశ నీ కౌగిలిలో ఉండాలని కోరిక”
Comments are closed.