ఆదరించవ దీవించవ - నీ కృపను చూపి నన్ను చేరవా! ||2||
యేసూ, నన్ను చేరవా... నీ కృపను జూపి నన్ను చేరవా! ||2||
||ఆదరించవ దీవించవ ||
1.నాకెందరో ఆప్తులు ఉన్నారనీ -
బహుగర్విగా జీవించి యుంటిని||2||
నా అక్కరలో ఏ తోడు లేక - ఏకాకినైయుంటినీ...||2||
ఏకాకినై నేయుంటినీ....
||యేసూ, నన్ను చేరవా||
2.నా బుద్ధి, నా జ్ఞానము, నా బలమనీ -
నా భక్తియే యుక్తమని భ్రమసి యుంటిని||2||
నా నీతి క్రియలు నీ కనులకు మురికి గుడ్డలే -
పడియుంటినీ నా కాలు జారిన చోటే....||2||
పడియుంటినీ నా కాలు జారిన చోటే....
||యేసూ, నన్ను చేరవా||
3.నాకున్న ఆశంత నీవేనయ్యా -
నీ ముఖమును దాచి దాటిపోబోకయ్యా
నీ చేతి తట్టు వేచి చూచు దాసుడను -
నన్ను సిగ్గు పడనీయకు ఓ యేసయ్యా...||2||
నన్ను సిగ్గు పడనీయకు నా యేసయ్యా....
||యేసూ, నన్ను చేరవా||
1 thought on “24.ఆదరించవ దీవించవ నీ కృపను చూపి నన్ను చేరవా”
Comments are closed.