అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను
ఓటమి ఎరుగనీ మన దేవుడు ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -
కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు-
శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును ||2||
1.అగ్ని గుండములో నెట్టివేసిన -
సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శత్రూవే నీ స్థితిచూచి అతిశేయ పడుచున్న -
సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ -
తెరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై ||2||
శత్రువు చేతికి నిను అప్పగించడు ||2||
||సియోను దేవుడే||
2.పరిస్థితులన్నీ చేజారిపోయిన-
ఎంతగానో శ్రమపడిన ఫలితమేమి లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన -
మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
మారదీ తలరాతని దిగులుపడకుమా -
మారాను మధురముగా మార్చును నీకై ||2||
మేలులతో నిను తృప్తిపరచును ||2||
||సియోను దేవుడే||
3.ఒంటరి పోరాటమే విసుగురేపిన-
పొందిన పిలుపే భారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న-
నమ్మదగినవారులేక నిరాశతో నిలిచిన
పిలుపునే విడచి మరలిపోకుమా-
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను ||2||
పిలిచిన దేవుడు నిను మరచిపోవునా ||2||
||సియోను దేవుడే||
1 thought on “40.అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను”
Comments are closed.