39.నిన్ను నేను విడువనయ్యా దేవానన్ను దీవించు వరకు

నిన్ను నేను విడువనయ్యా దేవా
నన్ను దీవించు వరకు ||2||

అబ్రహాము దేవా ఇస్సాకు దేవా
యాకోబును దీవించిన దేవా ||2||
	|| నిన్ను నేను ||

1. నా తోడై ఉంటానన్నావే నే వెళ్ళు ప్రతి చోటా
నను దీవించు వరకు విడువనన్నావే ||2||
తల్లి మరచినా నా తండ్రి విడిచినా ||2||
కునుకక నిదురపోక నను చూస్తున్నావు దేవా ||2||
	|| అబ్రహాము దేవా ||

2. గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే
నీ కన్నా గొప్ప కార్యాలు చేసెదనన్నావే ||2||
మనుష్యుడవు కాదు నీవు మాట తప్పుటకు ||2||
అన్ని గతించిన నీ మాట శాశ్వతము ||2||
	|| అబ్రహాము దేవా ||"

     

1 thought on “39.నిన్ను నేను విడువనయ్యా దేవానన్ను దీవించు వరకు”

Comments are closed.

Footer Page