నన్ను చూచువాడా
నిత్యం కాచువాడా ||2||
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు ||2||
కూర్చుండుట నే
లేచియుండుట
బాగుగ యెరిగియున్నావు ||2|| రాజా
||నన్ను||
1. తలంపులు తపనయు అన్నీ
అన్నియు యెరిగియున్నావు
నడచిననూ పడుకున్ననూ
అయ్యా! నీవెరిగియున్నావు
ధన్యవాదం యేసు రాజా ||2||
||నన్ను||
2. వెనుకను ముందును కప్పి
చుట్టూ నన్ను ఆవరించావు
(నీ) చేతులచే అనుదినము
పట్టి నీవే నడిపించావు
ధన్యవాదం యేసు రాజా ||2||
||నన్ను||
3. పిండమునై యుండగా నీ కన్నులకు
మరుగై నేనుండలేదయ్యా
నిర్మించితివి
ఆశ్చర్యమే కలుగుచున్నది
ధన్యవాదం యేసు రాజా ||2||
||నన్ను||
1 thought on “41.నన్ను చూచువాడానిత్యం కాచువాడా”
Comments are closed.