37.నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని


పల్లవి : 
నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని 
నా ..కోసమే ఒక చిత్తమే ఉన్నాధని  ||2||
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై  ||2||

ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే 
	||నా జీవితానికీ||

చరణం:
సృష్టిలోనే సౌందర్యమైన అదియే వివాహ బంధము ...
కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము  ||2||
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
జీవము అను కృపావరములో ఒకరికొకరుగా జీవించాలి||2|||
	||నా జీవితానికీ||

చరణం:
పానుపే పవిత్రమైన నిష్కళంకమైనది ...
జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు.  ||2|| 
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
అది కళంకము ముడతలైనను మరి ఏదియు లేని ప్రేమ ఇది  ||2||
	 ||నా జీవితానికీ||

చరణం:
క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్య ను ప్రేమించవలెను ...
సంఘమూ లోబడినంతగా భార్య భర్త కు లోబడవలెను. ||2||
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై  ||2||

ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే  ||2||
	 ||నా జీవితానికీ||

     

2 thoughts on “37.నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని”

Comments are closed.

Footer Page