23.వేలాది వందనాలయ్యా నీకు కోట్లాది స్తోత్రలయ్యా



పల్లవి:
ఏందుకయ్యా యేసయ్యా 
నేను అంటే ఇష్టమయ్యా ||2||
నీ రూపులో నన్ను చేసావన 
నీ పోలికే నాకు ఇచ్చావనా 
నీ ఊపిరే నాలో ఊదావనా 
నీ శ్వాసనే ఇచ్చావనా 

అ.ప: వేలాది వందనాలయ్యా 
నీకు కోట్లాది స్తోత్రలయ్యా ||2||

చరణం1: 
నన్ను కాపాడుటకు నీవు 
కునుకవు నిద్రించవు 
నన్ను ఎదురించిన వారిని 
నీవే తరిమెదవు 
పగలు మేఘమైనావు రాత్రి అగ్నిస్తంభమైనావు||2||
   ||వేలాది వందనాలయ్యా ||

చరణం2: 
నా కన్నీరు తుడుచుటకు నీ చేయి చాపెదవు
నాదుఃమునకు బదులు నీ కృపనే ఇచ్చావు 
నీ రెక్కలతో కప్పావు 
తెగులు రాకుండా దాచావు ||2||
 ||వేలాది వందనాలయ్యా ||
     

Footer Page