22.ఊహించ లేదయ్యా ఈ మేలులన్నియు



పల్లవి:
ఊహించ లేదయ్యా ఈ మేలులన్నియు
తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు ||2||
పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా,||2||.

చరణం :
తీసివేయబడి నను త్రోసి వేయబడినను
అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడి నను||2||
అందరు వదిలేసిన నీవు నన్ను పట్టుకున్నావు దుంఖము ముంచేసిన నన్ను పైకీ లేపవయ్య||2||
పాడకుండా ఉండలేనయ్యా-నిన్నుపొగకుండా బ్రతకలేనయ్యా||2||
|| ఊహించలేదయ్యా||

చరణం :
ఉడికిపోయిఉన్నాను – ఎండిపోయి ఉన్నాను – 
ఆశలన్నీ నీరు కారి -వేశారిపోయాను||2||
ఆఖరి ఆక్షణములో నీవు నన్ను దర్శించినావు-
ఉహించని నీ మేలుతో నన్ను తృప్తి పరిచావయ్యా||2||
పాడకుండా ఉండలేనయ్యా-నిన్ను పొగడకుండా బ్రతక లేనయ్యా ||2||
||ఊహించలేదయ్యా||
    
     

Footer Page