పల్లవి : ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప(2) -
ఇంత వరకు కాచేనే చెంత నుండి నీ కృప(2)
అంతము వరకు నడిపించునే (2)
అంతేలేని నీ కృప
కృపా కృపా కృపా.... యేసు నీ కృప (ఎరుగని )
చరణం: గల గల పారే సెలయేరులా
నాలో ప్రవహించే నీ కృప(2)
శిలనైన హృది కరిగించేనే(2)
వెలయే లేని నీ కృప (2)(కృప కృప కృపా )
చరణం: పావనమైన జీవన యాత్రలో
క్షేమము నిచ్చే నీ కృపా(2)
క్షణమైనా నన్ను ఎడబాయక(2/
గమ్యము చేర్చే నీ కృప (2) (కృప కృప కృపా )