16.ప్రేమ గల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకె స్తోత్రము






ప్రేమ గల తండ్రి కృపగల యేసు 
దయగల ఆత్మ నీకె స్తోత్రము (2)
నాయందు జాలిపడు దేవా...
నా నీతివైన నా ప్రభువా... (2)
నా కృప వీడి పోదంటివే 
నా నిబంధన తొలగదంటివే  (2) "ప్రేమ"

1. అరచేతిలో చెక్కుకున్నానంటివే...
   నా చేతిలో నక్షత్రం అంటివే (2)
   నీ చేతిలో  నిత్యసుఖములుండగా
   ఆ కరుణ హస్తము నాకు చాలయ్య (2)

2. నిందనలను రెట్టింపు ఘనతగా
    బాధలను మరచినకనగా (2)
    దుఃఖమునే నాట్యముగామార్చి
    బూడిదకే అందాన్ని ఇయ్యవా (2)

3. నాకొరకు ఎదురు చూసిన ప్రేమ
    నాకడకు పరుగెత్తిన ప్రేమ(2)
    నా మీద పడి ముద్దాడిన
    నీ కౌగిలిలో జీవింతును (2)

4. నావలన నష్టమే కలిగినా
   అవమానమునే కలిగించిన (2)
   నీ కోల్పోయినవన్నీ నాకిచ్చి
  విందు చేసి మంచి సాక్ష్యంమిచ్చావా (2)"ప్రేమ"
     

Footer Page