స్థిరపరచువాడవు - బలపరచువాడవు
పడిపోయిన చోటే - నిలబెట్టువాడవు
ఘనపరచువాడవు - హెచ్చించువాడవు
మా పక్షము నిలిచి - జయమిచ్చువాడవు
ఏమైనా చేయగలవు - కథ మొత్తం మార్చగలవు
నీ నామముకే మహిమంతా - తెచ్చుకొందువు || 2||
యేసయ్యా యేసయ్యా - నీకే నీకే సాధ్యము ..! ||2||
1) సర్వకృపానిధి - మా పరమ కుమ్మరి
నీ చేతిలోనే - మా జీవమున్నది ||2||
మా దేవా నీ ఆలోచనలన్నీ - ఎంతో గొప్పవి
మా ఊహకు మించిన కార్యములెన్నో - జరిగించుచున్నవి ||2||
||ఏమైనా చేయగలవు||
2) నీ ఆజ్ఞ లేనిదే - ఏదైన జరుగునా ?
నీ కంచె దాటగ - శత్రువుకు సాధ్యమా ? ||2||
మా దేవా నీవే మా తోడుంటే - అంతే చాలును
అపవాది తలచిన కీడులన్నీ - మేలైపోవును ||2||
||ఏమైనా చేయగలవు||