సాకి:సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ
పల్లవి:సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ దీర్ఘకాలము సహించిన ప్రేమ ||2||
సాటిలేనిది అనంతమైనది ||2||
//సాటిలేని//
1. నీ కన్నులు నన్ను చూస్తుండగా నా పాపము పెరిగిపోవుచుండగా ||2||
నీ ప్రేమ నను విడిచి పోలేదయా పాపములో నను విడిచి పెట్టలేదయా ||2||
సాటిలేనిది నీ ప్రేమయా అనంతము నన్ను సహించినాదయ
సాటిలేనిది నీ ప్రేమయా అనంతము నన్నుక్షమించినాదయ్యా ||2||
//సాటిలేని//
2. నా కన్నులు కప్పిపోయి ఉండగా నిన్ను నేను తృణీకరించుచుండగా ||2||
నీ ప్రేమ నను విడిచి పోలేదయా పాపములో నను విడిచి పెట్టలేదయా ||2||
సాటిలేనిది నీ ప్రేమయా అనంతము నన్ను క్షమించినాదయ్యా ||2||
//సాటిలేని//
3. నా హృదయము మోసగిస్తుండగా నా శరీరము లోకాన్ని ప్రేమిస్తుండగా ||2||
నీ ప్రేమ నన్ను సహిస్తుండెనా నా పాపము నిన్ను గాయ పరుస్తుండెనా ||2||
సాటిలేనిది నీ ప్రేమయా అనంతము నన్ను సహించినాదయ ||2||
//సాటిలేని//
సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ దీర్ఘకాలము సహించిన ప్రేమ ||2||
నీ ప్రేమను వివరింపలేనయా నా జీవితమును వెలిగింపజేయయా ||2||
సాటిలేనిది నీ ప్రేమయా
2 thoughts on “30.సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ”
Comments are closed.