నీ కృపలోనే బ్రతకాలని ఆశ
నీ కౌగిలిలో ఉండాలని కోరిక ||2||
నీ శరణు నే జొచ్చియున్నానయ్యా
నా దిక్కు నీవే నయ్యా
ఆధారమా ఆనందమా ఆశ్రయపురమెసయ్య
||నీ కృపలోనే||
1: చరణం:
నీ నీటి కాలువ యోరను ఉండి ఫలమిచ్చు చెట్టులా బ్రతకాలని
దివారాత్రము నిన్నే ధ్యానించుచు ధన్యుడనై జీవించాలని.
నీ సారమే నాలోపట - అభివృద్ధి చెందాలని
||నీ శరణు నే జొచ్చియున్నానయ్యా||
2 చరణం:
నీదుఒడిలో నే ఒదిగిపోయి నిశ్చింతగానే ఉండాలని
నీలో ఉన్న అతిశ్రేష్ట ఫలములు అనుభవిస్తూ బ్రతకాలని
పరిశుద్ధతే జీవితమై ప్రజ్వలించాలని
||నీ శరణు నే జొచ్చియున్నానయ్యా||
1 thought on “29.నా దిక్కు నీవే నయ్యా ఆధారమా ఆనందమా ఆశ్రయపురమెసయ్య”
Comments are closed.