17.నా నమ్మిక నీవు మాత్రమే నేనెపుడు నిను విడువను యేసయ్యా



నా నమ్మిక నీవు మాత్రమే
నేనెపుడు నిను విడువను యేసయ్యా
నేనెపుడు నిను విడువను

అ.ప.:
ఎన్ని కష్టాలైనా బెదరను 
ఎంత బాధైనా వెనుదిరుగను

చరణం :- 1
విలువగు రక్తాన్ని చిందించిన
కలుషములన్ని హరియించిన (2)
నీ ప్రేమను ప్రకటింతును (2)
నీ సేవ జరిగింతును
యేసయ్య నీ సేవ జరిగింతును
( ఎన్ని కష్టాలైనా )

చరణం :- 2
బలమగు హస్తాన్ని అందించిన
మరణము నుండి బ్రతికించిన (2)
నీ చాటున నివసింతును (2)
నీలోనే ఫలియింతును
యేసయ్య నీలోనే ఫలియింతును
( ఎన్ని కష్టాలైనా )

చరణం :- 3
కరుణతో వాక్యాన్ని పంపించిన
కలవరమంతా తొలగించిన (2)
నీ కార్యము వివరింతును (2)
నీతోనే పయనింతును
యేసయ్య నీతోనే పయనింతును
( ఎన్ని కష్టాలైనా )
     

Footer Page