33.నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను

నిత్యము స్తుతించినా
నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా
నీ త్యాగము మరువలేను (2)

రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు (2)          
	 ||నిత్యము||

అద్వితీయ దేవుడా
ఆది అంతములై యున్నవాడా (2)
అంగలార్పును నాట్యముగా
మార్చివేసిన మా ప్రభు (2)                 
	 ||రాజా||

జీవమైన దేవడా
జీవమిచ్చిన నాథుడా (2)
జీవజలముల బుగ్గ యొద్దకు
నన్ను నడిపిన కాపరి (2)                   
	 ||రాజా||

మార్పులేని దేవుడా
మాకు సరిపోయినవాడా (2)
మాటతోనే సృష్టినంతా
కలుగజేసిన పూజ్యుడా (2)                  
	 ||రాజా||

     

1 thought on “33.నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను”

Comments are closed.

Footer Page