32.గుండె ఆగకముందే కళ్ళు తెరుచుకో

పల్లవి :1చరణం :
గుండె ఆగకముందే కళ్ళు తెరుచుకో 
పాడె ఎత్తక ముందే ప్రభుని చేరుకో   ||2||
యేసు వార్తను తెలుసుకో - నిత్యజీవం పొందుకో ||2||
		||గుండె||

1. దేహమంతా మట్టేగా చూసిచూసిమురువకు 
శిథిలమయ్యే శల్యమందు అన్ని ఆశలు ఎందుకో ||2||
కుండలాగా చితికిపోవునుగా బుడగలాగా పగిలిపోవునుగా 
ఆయుష్షు మళ్ళీ వెనుకకు రాదుగా కళ్ళముందే కరిగిపోవునుగా ||2||
నీ దేహము దేవునికిస్తే నీ ఆత్మ క్షేమముగా 
శరీరము మట్టిలో కలిసినా మహిమలో నీవుందువుగా ||2||
		||గుండె|| 
2చరణం :
 2. అద్దెఇల్లు లాంటిది నీవు వున్న ఈలోకం -
 కూడబెట్టినదేదైనా విడిచిపెట్టి వెళ్ళాలి ||2||
యేసు దేవుని రక్షణ నీకుంటే పరమజీవం నీకు దొరుకునుగా -
 ఒక్కసారి ఆలోచించవా నరకము పరలోకముందని ||2||
 యేసు ఒక్కడే చేర్చును ఆయనలోనే మోక్షము - 
సమయమింక లేదుగా ఇప్పుడే హృదయము ఇవ్వవా ||2||
		||గుండె||

     

1 thought on “32.గుండె ఆగకముందే కళ్ళు తెరుచుకో”

Comments are closed.

Footer Page