42.భయము చెందకు భక్తుడాఈ మాయ లోక ఛాయను చూచినప్పుడు



భయము చెందకు భక్తుడా
ఈ మాయ లోక ఛాయను చూచినప్పుడు ||2||
భయము చెందకు నీకు
జయము దయచేయువాడు ||2||
దేవుడే యెహోవయున్నాడు నీ సాయమునకు
దేవుడే యేసన్నయున్నాడు  ||2||
	 ||భయము ||

1.
చెరసాలలో వేసినా
తమ దేహమంతా గాయాలతో నిండినా  ||2||
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ ||2||
భూకంపం కలుగలేదా 
ఓ భక్తుడా... భూకంపం కలుగలేదా ||2||
భక్తులు ముగ్గురు చెర నుండి 
విడుదల కాలేదా ||2||
	  ||భయము ||

2.
బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు 
బొమ్మకు మ్రొక్కనందునా  ||2||
పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే ||2||
నాల్గవ వాడు ఉండలేదా
ఓ భక్తుడా... నాల్గవ వాడు ఉండలేదా  ||2||
	  ||భయము ||

3.
ఆస్థి అంతా పోయినా
తన దేహమంతా కురుపులతో నిండినా  ||2||
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె ||2||
అని యోబు పలుక లేదా
ఓ భక్తుడా... అని యోబు పలుక లేదా ||2||
	||భయము ||

 

1 thought on “42.భయము చెందకు భక్తుడాఈ మాయ లోక ఛాయను చూచినప్పుడు”

Comments are closed.

Footer Page