
పల్లవి :
నీవుతప్ప నాకెవరున్నారు యేసయ్య నీవే నా ఆధారము
నీవుతప్ప నాకెవరున్నారు యేసయ్య నీవే నా ఆశ్రయము
యేసయ్య... యేసయ్య... నీవే నా ఆధారము
యేసయ్య... యేసయ్య... నీవే నా ఆదరణ
||నీవుతప్ప నాకెవరున్నారు||
1 చరణం :
నీ మాటలే నన్ను బ్రతికించెను
నీ చూపులో నెమ్మది దొరికెను ||2||
అమ్మా అమ్మా అని పిలిచావయ్యా
నా భారమంతయు తీసివేసినవయ్యా ||2|
||నీవుతప్ప నాకెవరున్నార||
2 చరణం :
నీ నీడలో ఆశ్రయము దొరికెను
నీ కౌగిలిలో నేనొదిగిపోతిని ||2||
నా ప్రాణం నీలో సేదతీరేను
నా మార్గమంతయు పులా బాట అయ్యెను ||2||
||నీవుతప్ప నాకెవరున్నారు||
<
1 thought on “28.నీవుతప్ప నాకెవరున్నారు యేసయ్య నీవే నా ఆధారము”
Comments are closed.