24.ఆదరించవ దీవించవ నీ కృపను చూపి నన్ను చేరవా




ఆదరించవ దీవించవ - నీ కృపను చూపి నన్ను చేరవా! ||2||
యేసూ, నన్ను చేరవా... నీ కృపను జూపి నన్ను చేరవా! ||2||
       ||ఆదరించవ దీవించవ ||

1.నాకెందరో ఆప్తులు ఉన్నారనీ  - 
బహుగర్విగా జీవించి యుంటిని||2||
నా అక్కరలో ఏ తోడు లేక - ఏకాకినైయుంటినీ...||2||
ఏకాకినై నేయుంటినీ....
                  ||యేసూ, నన్ను చేరవా||

2.నా బుద్ధి, నా జ్ఞానము, నా బలమనీ -
 నా భక్తియే యుక్తమని భ్రమసి యుంటిని||2||
నా నీతి క్రియలు నీ కనులకు మురికి గుడ్డలే -
 పడియుంటినీ నా కాలు జారిన చోటే....||2||
పడియుంటినీ నా కాలు జారిన చోటే....                                    
                  ||యేసూ, నన్ను చేరవా||

3.నాకున్న ఆశంత నీవేనయ్యా -
 నీ ముఖమును దాచి దాటిపోబోకయ్యా
నీ చేతి తట్టు వేచి చూచు దాసుడను  -  
నన్ను సిగ్గు పడనీయకు ఓ  యేసయ్యా...||2||
నన్ను సిగ్గు పడనీయకు నా యేసయ్యా....
                  ||యేసూ, నన్ను చేరవా||
     

1 thought on “24.ఆదరించవ దీవించవ నీ కృపను చూపి నన్ను చేరవా”

Comments are closed.

Footer Page