నా ప్రాణ ప్రియుడా మహనీయుడా
నా యేసయ్యా నీతో ఉంటానయ్యా ||2||
నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిను విడువలేనయ్యా||2|||నా ప్రాణ |
1. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ||2||
శ్రమలు శోధించినా…నాతో నీవున్న ! ధైర్యమే కలిగేనా ||2||
ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా
తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా ||2|||నీవే కావలేసయ్యా|
2. కన్నీరే సముద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా ||2||
నే నలిగిపోయినా…నాతో నీవున్న ! ధైర్యమే కలిగేనా ||2||
ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా
తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా ||2|||నీవే కావలేసయ్యా|