2.దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని

దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
దారులలో ఎడారులలో - సెలయేరులై ప్రవహించుమయా
చీకటిలో కారు చీకటిలో- అగ్ని స్తంభమై నను నడుపుమయా

1. నువ్వే లేకుండా – నేనుండలేను యేసయ్య 
నీ ప్రేమే లేకుండా - జీవించలేను నేనయ్య

 నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే 
-నే నడిచే దారుల్లో - నా తోడై వున్నావే  (2) 

ఊహలలో నా ఊసులలో - నా ధ్యాస బాసవైనావే 
శుద్ధతలో పరిశుద్ధతలో - నిను పోలి నన్నిల సాగమని ||దీవించావే ||

2. కొలతే లేదయ్యా - నీ జాలి నాపై యేసయ్య
 కొరతే లేదయ్యా – సమృద్ధి జీవం నీవయ్యా<
 
 నా కన్నీరంతా తుడిచావే - కన్న తల్లిలా 
కొదువంతా తీర్చావే - కన్న తండ్రిలా   (2) 

ఆశలలో నిరాశలలో – నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటములో నా పక్షముగా నిలిచావే   ||దీవించావే ||
     

Footer Page