ఎన్ని అవమనములు కలిగినా
ఎన్ని నిందలలో నే నిలచిన
కష్టకాలములో నే నడచిన
అవహేళనలు నను తరిమినా
సిగ్గు పడనియ్యవు ఒడిపోనియ్యవు
పడిపోనియ్యవు ఆగిపోనియ్యవు
నాకు నీవున్నావు నన్ను విడువనన్నావు
నీతో నడిపిస్తావు నన్ను గెలిపిస్తావు
1.ప్రాణ ప్రియులే నను విడచిపోగా
నీ ప్రేమ నను విడువదు
నిను నేను మరచిన నను మరచిపోవు
ఎంత మంచి దేవుడవేసయ్య
నాకు నీవున్నావు నన్ను విడువనన్నావు
నీతో నడిపిస్తావు నన్ను గెలిపిస్తావు
సిగ్గు పడనియ్యవు ఒడిపోనియ్యవు
పడిపోనియ్యవు ఆగిపోనియ్యవు
2.అందరు ఉన్నా ఒంటరిగా ఉన్న
నా పక్షమునా ఉన్నావు
శత్రువుల నుంచి నను సంరక్షించి
విజయమును నాకిచ్చావు
నాకు నీవున్నావు నన్ను విడువనన్నావు
నీతో నడిపిస్తావు నన్ను గెలిపిస్తావు
సిగ్గు పడనియ్యవు ఒడిపోనియ్యవు
పడిపోనియ్యవు ఆగిపోనియ్యవు