
నటించే ఓ నరుడ... నమ్ముకోకు ఈ లోకం నమ్మినవారెందరో మట్టిలో కలసిపోయారుగా... నీవు నమ్ముకున్నవన్ని నీవెంటరావు మరువకూ... నమ్ము సోదరా ! నీవు నమ్ము సోదరి ! నమ్ము సోదరా ! ఇది నిజము సోదరి ! \2\ 1.ధనము బలగమున్న నీవు అందగాడివైన మాటకారివైనా మంచి ఆటకాడివైనా \2\ నీ ధనము రాదు వెంట నీ బలము రాదు వెంట అందము మోసము సౌందర్యము వ్యర్థము \2\ 2.తల్లిదండ్రులున్న నీకు భార్య భర్త ఉన్న కన్నబిడ్డలున్న నీకు అన్నదమ్ములున్నా \2\ ఎవరు రారు వెంట ఆ దేవుడే నీకు దిక్కు\2\ యేసు రక్తంలోనే నీ పాపానికి విమోచన \2\ 3.దేవుని నమ్మినవారెందరో లోకాన్ని నమ్ముకోలేదుర సమస్తమును పెంటతో పోల్చిన పౌలు మనకు మాదిరి \2\ యేసుక్రీస్తుని నమ్ముకో నీ ఆత్మకు రక్షణ - \2\ క్రీస్తుయేసునందే నీకు నిత్యజీవం - \2\
1 thought on “46.నటించే ఓ నరుడ… నమ్ముకోకు ఈ లోకం”
Comments are closed.