50.జగములనేలే పరిపాలకజగతికి నీవే ఆధారమా




జగములనేలే పరిపాలక
జగతికి నీవే ఆధారమా
ఆత్మతో మనసుతో స్తోత్ర గానము
పాడెద నిరతము ప్రేమగీతము

యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య
||జగమునేలే పరిపాలక||

1
మహారాజుగా నా తోడువై
నిలిచావు ప్రతి స్థలమున
నా భారము నీవు మోయగా
సులువాయే నా పాయనము
నీ దయచేతనే కలిగిన క్షేమము –
ఎన్నడు నను వీడదే (2)
నీ సన్నిధిలో పొందిన మేలు –
తరగని సౌభాగ్యమే  (2) 
|| యేసయ్యా ||

2
సుకుమారుడా నీ చరితము
నేనెంత వివరింతును
నీ మహిమను ప్రకటించగా
నేనెంతో ధన్యుడను
ఘనులకు లేదే ఈ శుభతరుణం –
నాకిది నీ భాగ్యమా (2)
జీవితమంతా నీకర్పించి –
నీ రుణము నే తీర్చనా (2) 
 || యేసయ్యా ||

3
పరిశుద్ధుడా సారధిమై
నడిపించు సీయోనుకే
నా యాత్రలో నే దాటిన
ప్రతి మలుపు నీ చిత్రమే
నా విశ్వాసము నీ పైనుంచి –
విజయము నే చాటనా (2)
నా ప్రతిక్షణము ఈ భావనతో –
గురియొద్దకే సాగెద (2) 
 || యేసయ్యా ||

1 thought on “50.జగములనేలే పరిపాలకజగతికి నీవే ఆధారమా”

Comments are closed.

Footer Page