44.గుండెల నిండా బాధతో ఉన్నవంటరి నేనై విలపిస్తున్న



  గుండెల నిండా బాధతో ఉన్న 
       వంటరి నేనై విలపిస్తున్న  ||2||
       నా కన్నీరు తుడిచావు యేసయ్య 
       నా చేయి పట్టి నడిపావు యేసయ్య  ||2||
 అను పల్లవి: 
      నీవే నీవే నా ప్రాణం 
      నీవే నీవే నా సర్వం  ||2||
      
	        ||గుండెల||
  1.
     సాగలేని నా జీవిత పయనంలో 
     వెక్కి వెక్కి ఏడ్చేటి వేళలో   ||2||
     నను ఓదార్చినావు-నాకు ఓర్పు నేర్పినావు ||2||
     తడబడుతున్న నన్ను స్థిరపరిచావు 
                                                   
          	||నీవే నీవే||

2.  గురి లేని నా జీవిత గమనంలో 
     గమ్యం ఏది కానరాని ఘడియలలో  ||2||
     నన్ను చూసినావు - నన్ను చేరదీసినావు ||2||
     నా చేయి పట్టి నన్ను నడిపించావు 
        	||నీవే నీవే||

3.  అండలేని నా ఒంటరి వేదనలో 
     ఎండమావిలాంటి ఆవేదనలో   ||2||
     నన్ను కరుణించినావు -  నీ  కృపను  చూపినావు ||2||
     నా తోడుగా నిలచి నన్ను బలపరిచావు
        ||నీవే నీవే||

 

1 thought on “44.గుండెల నిండా బాధతో ఉన్నవంటరి నేనై విలపిస్తున్న”

Comments are closed.

Footer Page