45.ఎవరేమనుకుంటున్నా నిన్ని ఆరాధిస్తున్నా


 ఎవరేమనుకుంటున్నా నిన్ని ఆరాధిస్తున్నా 
 నేనేమైపోతున్న నిన్ను కీర్తిస్తూ ఉన్నా 
 నిరాశ నిస్పృహలోన నీవైపే చూసున్నా 
 ఈ లోకపు అలజడిలో నా ఒడి నీవేగా          ॥2॥ 

1.  మదిలో మనశ్శాంతి లేక 
    మాటకి ఏదో మిగిలి ఉన్న 
    మతి వీడి ఉన్న నన్ను 
    మళ్లీ కలిసి మన్నించావే..... ||2||
    నా కథలో..... ఓ మలుపే తెచ్చావే 
    నా గుండెలో గొప్ప మార్పే ఇచ్చావే.. 
    యేసయ్యా.. నాకున్నది నీవయ్యా.. 
    యేసయ్యా.. నీవుంటే చాలయ్యా..... 
	||ఎవరేమనుకుంటున్నా||

2. బ్రతుకు బాట బరువుకు ఉన్న 
   బయటికి ఒకలా బ్రతుకుతున్న 
   దరిలేని నన్ను చేరి – బ్రమ నుండి వేరు చేసావే   ॥2॥ 
   యేసయ్యా... నన్నే భరించావా... 
   యేసయ్యా... నాకై బలైయవా... 
   దోషినైనా.. నన్నే ప్రేమించావా..... 
   దరిలేని.. నన్ను నీ దరి చేర్చావా.....
	||ఎవరేమనుకుంటున్నా||||

 

1 thought on “45.ఎవరేమనుకుంటున్నా నిన్ని ఆరాధిస్తున్నా”

Comments are closed.

Footer Page