20.ఉన్నతమైన కృపచూపుటకే నను బ్రతికించినది నీ కృపా




పల్లవి :ఉన్నతమైన కృపచూపుటకే 
నను బ్రతికించినది నీ కృపా 
అపొస్తులుల పరిచర్యను చేయుట కొరకే 
మము కోరుకున్నది నీ కృపా 
అ. ప :నీ కృప చాలును నీ కృప చాలును 
దేవా నీ కృప చాలును ||2||    "ఉన్నతమైన "
1.బలహీనతలో నా బలము నీవై 
నను బలపరచినది నీ కృప ||2||
నీ బాహుబలమే ఉన్నతమైన కార్యములు చేసేను ||2||
అది నీ కృపే!     " నీ కృప "
2.కృంగిన మనస్సుతో యబ్బేజు ప్రార్ధించగా 
దీవెనల వర్షమును కురిపించినది ||2||
చేసిన ప్రార్ధనలే సరిహద్దులను -విశాలాము చేసేను||2||
 అది నీ కృపే!     " నీ కృప "
3.నీ కృప మా యెడల హెచ్చుగా చూపి 
క్రీస్తనే బండపై మము నిలుపుచున్నది ||2||
నీ సంకల్పమే ఉన్నతమైన -పరిచర్య మాకిచ్చెను ||2||
అది నీ కృపే!    "నీ కృప "
    
     

Footer Page