ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని
తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని
మార్పులేని దేవుడ నీవని – మాట ఇచ్చి నెరవేర్చుతావని || 2||
మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని
నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా || 2||
అక్కున నన్ను చేర్చుకుంటివే – భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే ||2 || ఎరిగియున్నానయా ||
మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా || 2||
నిరాశలో నన్ను దర్శించితివే – ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే – కృపను పంచితివే
|| ఎరిగియున్నానయా ||